ETV Bharat / state

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జీఎస్‌టీ అధికారిపై సీబీఐ కేసు - హైదరాబాద్​లో జీఎస్​టీ అధికారి ఇంట్లో సీబీఐ సోదాలు

cbi-case-against-case-of-assets-exceeding-income-gst-officer-in-hyderabad
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జీఎస్‌టీ అధికారిపై సీబీఐ కేసు
author img

By

Published : Oct 2, 2020, 7:45 PM IST

Updated : Oct 2, 2020, 11:11 PM IST

19:12 October 02

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జీఎస్‌టీ అధికారిపై సీబీఐ కేసు

జీఎస్​టీలోని మరో అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు సీబీఐ నమోదు చేసింది. జీఎస్​టీ హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలోని కంప్యూటర్ సెక్షన్ సూపరింటెండెంట్ కేఎస్ఎస్ జనార్దన్ రావు భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నట్లు సీబీఐ గుర్తించింది. జనార్దన్​రావుతోపాటు.. ఆయన భార్య శైలజపై కేసు నమోదు చేసి పలు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపింది.

వేతనం ద్వారా వచ్చిన ఆదాయానికన్నా సుమారు కోటి 27 లక్షల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టుకున్న దర్యాప్తు సంస్థ గుర్తించింది. సెంట్రల్ ఎక్సైజ్​లో ఇన్​స్పెక్టర్​గా 1992లో చేరిన కేఎస్ఎస్ జనార్దన్ రావు.. 2003లో సూపరింటెండెంట్​గా పదోన్నతి పొందారు. సెంట్రల్ ఎక్సైజ్​లో కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగంలో 2007 నుంచి 2014 వరకు డిప్యూటేషన్​పై సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు. 

హైదరాబాద్​లోని జీఎస్​టీ కమిషనరేట్​లో పన్ను ఎగవేత విభాగంలో మూడేళ్లుగా సూపరింటెండెంట్​గా పనిచేస్తున్నారు. జనార్దన్ రావు, ఆయన భార్య పేరిట భారీగా ఆస్తులను సీబీఐ గుర్తించింది. హైదరాబాద్​లోని పెద్ద అంబర్ పేట, హైదర్ నగర్, జల్​పల్లి, మణికొండ, యూసుఫ్ గూడ, మధురానగర్​లో ఫ్లాటు. గుంటూరు, మంగళగిరి, అమరావతి ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లు సీబీఐ పేర్కొంది. సీబీఐ కేసు నమోదు చేసి కీలక ఆధారాలు సేకరించింది.

ఇదీ చూడండి : స్కూల్​ ఫీజులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: శివబాలాజీ, మధుమిత

Last Updated : Oct 2, 2020, 11:11 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.