ETV Bharat / state

'వెంకట్‌రెడ్డి నుంచి రక్షణ కల్పించేలా పోలీస్ శాఖను ఆదేశించండి' - సుహాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు

Case Registered Against MP Venkat Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై నల్గొండ ఒకటో పట్టణ పీఎస్‌లో 506 సెక్షన్‌ కింద కేసు నమోదైంది. చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. తనను చంపుతానంటూ ఫోన్‌లో బెదిరించారని, వెంకట్​రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

'కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నుంచి రక్షణ కల్పించండి'

author img

By

Published : Mar 10, 2023, 7:09 PM IST

Case Registered Against MP Venkat Reddy: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్.. ఎంపీపై మొన్న కేసు నమోదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఇదే విషయంపై మరోసారి చెరుకు సుధాకర్ స్పందించారు. ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ చెరుకు సుహాన్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. 5 తేదీ ఫోన్‌ చేసి చంపేస్తామని బెదిరించిన విషయాన్ని కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయంలో ఇవాళ ఫిర్యాదు చేశారు.

కోమటిరెడ్డి వల్ల తమ కుటుంబానికి హాని ఉందని.. తమకు భద్రత కల్పించే విధంగా పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేయాలని హెచ్​ఆర్సీని కోరినట్లు చెప్పారు. బెదిరింపు కాల్స్‌ వచ్చిన వెంటనే స్థానిక పోలీస్​స్టేషన్‌లోనూ, డీజీపీకి ఎంపీపై ఫిర్యాదు చేశామన్నారు. స్థానిక పోలీసులు, డీజీపీ ఈ కేసు విషయాన్ని చాలా చిన్నదిగా చూస్తున్నారని ఆయన వాపోయారు. వంద కార్లలో వచ్చి చంపేస్తామని చెప్పడం.. భావోద్వేగం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.

''కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు ఫోన్ చేసి బెదిరించారు. నన్ను, మా నాన్నని చంపేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెదిరించారు. కోమటిరెడ్డిపై స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చిన్న కేసు మాత్రం నమోదు చేశారు. అందుకే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాను. వెంటనే కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్​ను కోరాను. మా కుటుంబానికి భద్రత కల్పించేట్లు పోలీసు శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశాను.'' - చెరుకు సుధాకర్

ఇక ఇప్పటికే ఈ విషయంపై చెరుకు సుధాకర్‌ కుమారుడు సుహాస్‌ నల్గొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంకట్‌రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని సుహాస్ వివరించారు. చంపుతానంటూ ఫోన్‌లో బెదింరించినట్లు చేసిన ఫిర్యాదు మేరకు నల్గొండ ఒకటో పట్టణ పీఎస్​లో 506 సెక్షన్‌ కింద కేసు నమోదైంది.

ఇక చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్​తో తాను మాట్లాడిన మాటలు.. భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ కూడా ఇచ్చారు. తనకు వేరే ఉద్దేశం లేదని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.