ఓ భూ వివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిపై కోర్టు ఆదేశాల మేరకు జవహర్‌నగర్ పోలీస్టేషన్లో కేసు నమోదు అయింది. అతనితో పాటు కాప్రా తహసీల్దార్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కాప్రాలోని తన క్లయింట్ జూలకంటి నాగరాజుకు చెందిన సర్వే నంబర్ 152లో 90 ఎకరాల భూ వివాదంలో తలదూర్చి బెదిరింపులకు దిగుతున్నారని అడ్వొకేట్ మేకల శ్రీనివాస్ యాదవ్ కోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరపాలని జవహర్‌నగర్ పోలీసులను కోర్టు ఆదేశించడంతో ఉప్పల్ ఎమ్మెల్యేతో పాటు, తహసీల్దార్ గౌతమ్ కుమార్‌పై కూడా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్‌పై విడుదల వాయిదా