బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు అతిక్రమించి మాస్క్‌లు ధరించని 17 మందిపై హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నియమాలను పాటించకుండా మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా ఉన్న స్థానికులకు పోలీసులు అవగాహన కల్పించారు.
అవసరం మేరకు బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం చేయాలని పోలీసులు సూచించారు. చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకుని ఆరోగ్య నియమాలు పాటించాలని పోలీసులు పేర్కొన్నారు. మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్ని కాలనీలు, పార్క్ స్థలాలు, జన సంచారం ఉండే ప్రదేశాలు, ప్రార్థనా మందిరాల వద్ద కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు.
ప్రతి ఒక్కరూ విధిగా మాస్కును ధరించాలని సూచించారు. అందరూ తమ ఆరోగ్యం, కుటుంబంను కాపాడుకుంటూ, ఇతరులకు కుడా అవగాహన కల్పించాలని మలక్ పేట ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు.
ఇదీ చూడండి : '45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి'