హైదరాబాద్ చాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలో ఓ కారు మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. మలక్‌పేట నుంచి చాదర్‌ఘాట్ వైపు వెళ్తుండగా... కారు టైర్ పంచర్ అయి ప్రమాదం జరిగినట్లు కారులో ఉన్న వాళ్లు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడం వల్ల అందులో ఉన్న నలుగురికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ఇవీ చూడండి: నేడు రాష్ట్రస్థాయి పురపాలక సదస్సు