Group 1,2 Interviews: నేరుగా నియామకాలు చేపట్టే అన్ని ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూలు రద్దు చేసింది. నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా, ఎలాంటి పక్షపాతానికి ఆస్కారం లేకుండా... ఎంపిక ప్రక్రియపై అభ్యర్థులకు పూర్తి విశ్వాసం కలిగేలా ఈ నిర్ణయం తీసుకొంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టే అన్ని ఉద్యోగాలకు ముఖాముఖి రద్దు చేశారు. గ్రూప్ 1 సహా ఇక నుంచి వచ్చే నోటిఫికేషన్లకు చెందిన అన్ని ఉద్యోగాలకు ముఖాముఖిని తొలగించారు. ఇతర నియామక సంస్థల ద్వారా చేపట్టే నియామకాలకు సైతం ఇంటర్వ్యూలు రద్దయ్యాయి. శాఖాపరమైన కమిటీల ద్వారా ఎంపిక చేసే ఉద్యోగాలకు కూడా ఇంటర్వ్యూలు రద్దు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
tspsc group1: రాష్ట్రంలో గ్రూప్-1 ప్రకటన జారీకి టీఎస్పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేసింది. గ్రూప్-1లో 503 పోస్టుల భర్తీకి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన కమిషన్ వాటిని క్రోడీకరిస్తోంది. మొత్తం 12 శాఖల నుంచి 19 రకాల పోస్టులకు ప్రతిపాదనలు అందగా వాటిలో నాలుగైదు రకాల పోస్టులకు ఆయా విభాగాల నుంచి సవరణ ప్రతిపాదనలు అందాల్సి ఉంది. అవి రాగానే ప్రకటన జారీ చేయాలని కమిషన్ భావిస్తోంది.
ఇదీ చూడండి: tspsc group1: గ్రూప్-1 ప్రకటనపై టీఎస్పీఎస్సీ కసరత్తు