రాష్ట్రంలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై ఎస్‌ఈసీ నిషేధం విధించింది. పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం ఆపాలని స్పష్టం చేసింది. 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎస్‌ఈసీ పార్థసారథి సూచించారు. కొందరు నేతలు, అభ్యర్థులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని... ఆ ఉల్లంఘనలతో ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు కరోనా వ్యాప్తి వేళ ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ తరుణంలో రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగితే సీఎం కేసీఆర్‌దే బాధ్యత అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు.
ఇదీ చూడండి : పుర ఎన్నికల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ