ETV Bharat / state

రేపే మంత్రివర్గ విస్తరణ..? - కేసీఆర్

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది.  ఆదివారం వసంతపంచమి నాడు కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం  చేయించాలని సీఎం నిర్ణయించినట్టు సమాచారం. రెండో దశలో 8 నుంచి 10 మందికి పదవులు దక్కే అవకాశం ఉంది.

నేతలతో కేసీఆర్
author img

By

Published : Feb 9, 2019, 4:21 PM IST

Updated : Feb 9, 2019, 6:02 PM IST

రేపే మంత్రివర్గ విస్తరణ..?
రెండు నెలలుగా మంత్రి పదవులు కోసం ఎదురు చూస్తున్న ఆశావహులకు కేసీఆర్ తీపి కబురు అందించబోతున్నట్టు సమాచారం. ఆదివారం వసంతపంచమి నాడు మంత్రివర్గవిస్తరణ చేయాలని సీఎం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ దఫా 8 నుంచి 10 మందిని పదవులు వరించనున్నాయి. మహబూబ్​నగర్​ నుంచి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. తెరాస వ్యవస్థాపక సభ్యుడు, కేసీఆర్​కు సన్నిహితుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
undefined
నిజామాబాద్ ​నుంచి వేముల ప్రశాంత్​ రెడ్డికి కేబినెట్‌లో చోటు కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి. గులాబీదళపతికి ఆప్తుడుగా ఆయనకు పేరుంది. ప్రస్తుతం మిషన్​ భగీరథ కార్పొరేషన్ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. పోచారం శాసనసభాపతిగా వెళ్లడం వల్ల ప్రశాంత్​కు మార్గం సుగమమైందని సమాచారం.
ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి యోగం వరించే అవకాశం ఉంది. ఆరుసార్లు శాసనసభకు, ఒకమారు లోక్​సభకు ఎన్నిక ఆయనకు కలిసొచ్చే అంశాలు.
బీసీ కోటాలో తలసాని శ్రీనివాసయాదవ్​ను మరోసారి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. గత అసెంబ్లీకి తెలుగుదేశం నుంచి ఎన్నికై తెరాసలో చేరిన తలసాని...వాణిజ్యపన్నులు, పశుసంవర్థకశాఖ మంత్రిగా పనిచేశారు. ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన నేత ఈటల రాజేందర్​ గతంలో తెరాస శాసనసభాపక్షనేతగా, తెలంగాణ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈసారి కూడా ఈటలకు మంత్రి పదవి దాదాపు ఖాయమైంది.
నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డిలలో ఒకరు అమాత్యులు కానున్నారు. గత లోక్​సభ ఎన్నికల్లో గుత్తా కాంగ్రెస్​ నుంచి ఎంపీగా గెలిచి తెరాసలో చేరారు. ప్రస్తుతం రాష్ట్ర రైతు సమన్వయ సమితికి ఛైర్మన్‌గా ఉన్నారు. జగదీష్ రెడ్డి రేసులో ఉన్నారు. మొదట్నుంచీ కేసీఆర్​ వెన్నంటి ఉండటం, రెండోసారి శాసనసభకు ఎన్నికవడం, మొదటి దఫాలో విద్య, ఇంధన శాఖ మంత్రిగా పనిచేయడం కలిసొచ్చే అంశాలు.
ఎస్సీ కోటాలో ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్​కు కేబినెట్‌ బెర్త్ దాదాపు ఖరారైందని సమాచారం. మొదటి నుంచి తెరాసలో ఉండటం, ఆరుసార్లు శాసనసభకు ఎన్నిక.. ఆయనకు సానుకూల అంశాలు. కొప్పులను మంత్రిని చేస్తానని గతంలో కేసీఆర్ పలు మార్లు చెప్పారు.
రెడ్యా నాయక్​, రేఖా నాయక్​ ఇద్దరిలో ఒకరికి ఎస్టీ కోటాలో మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. రెడ్యా నాయక్​ సీనియర్​ నేత, మంత్రిగా పనిచేసిన అనుభవం కలిసొచ్చే అంశాలు. రేఖా నాయక్ కూడా మంత్రి రేసులో ఉన్నారు.
మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించడం, ఉపసభాపతిగా బాధ్యతలు నిర్వర్తించడం కలిసొచ్చే అంశాలు.
ఈ దఫా మంత్రివర్గ విస్తరణలో హరీశ్‌​ రావు, కేటీఆర్​కు పదవులు లేనట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో హరీశ్‌కు అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో హరీశ్‌ సేవలను వినియోగించుకునే ఉద్దేశంతో ప్రస్తుత మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోవచ్చన్న చర్చ బలంగా సాగుతోంది. కేటీఆర్ మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్​గా ఉన్నందున మంత్రి పదవి వద్దన్నారని ప్రచారం సాగుతోంది .

sample description
Last Updated : Feb 9, 2019, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.