హైదరాబాద్ ఓయూలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఏఏపై సదస్సు నిర్వహించారు. సెమినార్‌లో ముఖ్య అతిథిగా భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం ఏ మతానికి వ్యతిరేకంగా లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు నిజాలు తెలియవని... కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరని రాంమాధవ్ ఎద్దేవా చేశారు. పొరుగు దేశాల నుంచి వచ్చే శరణార్ధుల కోసమే ఈ సీఏఏ అని రాంమాధవ్ వెల్లడించారు.
శరనార్థులకు పౌరసత్వం భారత్ బాధ్యత...
ఇస్లామిక్ తెగలన్నీ భారత్‌లో ఉంటాయని... కానీ ఇస్లామిక్ దేశాల్లో ఉండవని అన్నారు. భారత్‌లో ఉన్న శరణార్ధుల పరిస్థితి ఏమిటిని ప్రతి పక్షాలను రాంమాధవ్ ప్రశ్నించారు. శరణార్ధులకు పౌరసత్వం ఇవ్వడం భారత్ బాధ్యతని... అదే అంశం మోదీ పూర్తి చేశారని పేర్కొన్నారు.
ఇవీ చూడండి : రూట్ల ప్రైవేటీకరణకు కేంద్రం రైట్ రైట్?