హైదరాబాద్ మొజంజాహీ మార్కెట్ కూడలి వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడింది. సిగ్నల్ మలుపు వద్ద లారీ బస్సును ఢీకొనగా ఈ ఘటన సంభవించింది. బస్సు డ్రైవర్‌తో సహా ఏడుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను బేగంబజార్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బోల్తా పడ్డ బస్సు(TS01 Z 0146) ఆదిలాబాద్ డిపోకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. లారీ, బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చూడండి: ఇరు రాష్ట్రాల అధికారులతో గవర్నర్ భేటీ వాయిదా