ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా(Anantapur district) కదిరిలో విషాదం చోటు చేసుకుంది. రెండు భవనాలు (Two buildings collapse in ap) కూలిపోయిన ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందారు. కదరిలోని పాత ఛైర్మన్ వీధిలో రెండు భవనాలు కూలిపోయాయి. మొదట రెండంతస్తుల భవనం.. మరో భవనంపై పడడంతో.. రెండు భవనాలు (Two buildings collapse in ap) నేలమట్టమయ్యాయి. ఒక ఇంట్లో 8 మంది ఉండగా… మరో ఇంట్లో ఏడుగురు ఉన్నారు. మొత్తం 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. భవనం కూలే సమయంలోనే సిలిండర్ పేలినట్లు బాధితులు తెలిపారు.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనస్థలానికి చేరుకున్నారు. జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగించి తొమ్మిది మంది బాధితులను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో శిథిలాలు తొలగించారు. అదనపు ఎస్పీ రామకృష్ణప్రసాద్, ఆర్డీవో వెంకటరెడ్డి.. ఘటనాస్థలిని పరిశీలించారు.
ఇవీ చూడండి:
- Trains cancel: భారీ వర్షాలు.. పలు రైళ్లు రద్దు, దారిమళ్లింపు
- Tirumala pedestrian path damaged: తిరుమలలో భారీ వర్షం.. కొట్టుకుపోయిన శ్రీవారి మెట్టు మార్గం
- Rains in Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. రానున్న 3 రోజులు మోస్తరు వర్షాలు
- Kadapa floods 2021 : మరో దారి లేక.. ట్రాక్టర్కు మృతదేహాన్ని కట్టి..!
- భారీ వర్షాలకు స్తంభించిన జనజీవనం- పాఠశాలలు బంద్!
- ఆగని వర్షాలు.. ఆ రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు