కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నుల విధానాల్లో పెద్దగా మార్పు లేదని ప్రముఖ ప్రత్యక్ష పన్నుల నిపుణులు సాంబశివరావు పేర్కొన్నారు. మినహాయింపులు క్లెయిమ్ చేసుకోకుండా.. కొత్త విధానంలోకి వెళితే ఉద్యోగికి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
మినహాయింపులు కొనసాగిస్తూ.. కొత్త శ్లాబులు ప్రవేశపెడితే లాభదాయకంగా ఉండేదని తెలిపారు. డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ పన్ను రద్దుతో సామాన్యుడి కన్నా.. కంపెనీలకే ఎక్కువ లాభం చేకూరుతుందన్నారు. ఆర్థిక స్థితిని గాడిన పెట్టేందుకు బడ్జెట్లో మరింత కసరత్తు చేయాల్సిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.