ETV Bharat / state

ఆదాయ, వ్యయాలకు అనుగుణంగా బడ్జెట్‌ కసరత్తు - తెలంగాణ ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌

రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశాజనకంగా ఉంది. కరోనా కష్టకాలంలోనూ జాతీయ సగటు కంటే మెరుగ్గా రాష్ట్ర స్థూల ఉత్పత్తి నమోదైనట్లు అంచనా వేసింది. అటు వచ్చే జాతీయస్థాయిలో వృద్ధిరేటు మెరుగ్గా ఉండవచ్చని అంచనా వేస్తున్న పరిస్థితుల్లో.. వచ్చే ఏడాది రాష్ట్రంలో మరింతగా మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే బడ్జెట్ కసరత్తు కొనసాగుతోంది.

Budget estimation with revenue and expenditure in telangana
ఆదాయ, వ్యయాలకు అనుగుణంగా బడ్జెట్‌ కసరత్తు
author img

By

Published : Mar 5, 2021, 5:30 AM IST

రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకొని 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. కరోనా, లాక్​డౌన్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు బాగా దెబ్బతిన్నాయి. ఏప్రిల్, మే నెలల్లో సర్కార్ ఖజానాకు ఆదాయం పూర్తిగా పడిపోగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 57 వేల కోట్ల రూపాయల మేరకు కోల్పోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.

ప్రతిపాదనలు

లాక్‌డౌన్‌ సడలింపులతో ఆయా రంగాల్లో తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దీంతో సర్కార్ ఖజానాకు కూడా ఆదాయం క్రమంగా పెరుగుతోంది. కాగ్ వివరాల ప్రకారం జనవరి నెలలో గరిష్ఠంగా 7,812 కోట్ల రూపాయల మేర పన్ను ఆదాయం వచ్చింది. ఫిబ్రవరి, మార్చిల్లో ఇది మరింతగా పెరుగుతుందని అంటున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను తయారు చేసే పనిలో ఆర్థికశాఖ అధికారులు పడ్డారు.

జీఎస్​డీపీ వృద్ధి

2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్​డీపీలోనూ వృద్ధి నమోదైంది. 1.35 శాతం వృద్ధితో 9,78,373 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో జీడీపీ 3.8శాతం తగ్గి 195.86 లక్షల కోట్లుగా నమోదైంది. 2021-22 లో జీడీపీలో 14.3 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేశారు. 2014-15 నుంచి చూస్తే కూడా రాష్ట్ర జీఎస్​డీపీ వృద్ధిరేటు జాతీయ జీడీపీ వృద్ధిరేటు కంటే ఎక్కువగానే ఉంటుంది. జీడీపీతో పోలిస్తే రాష్ట్ర జీఎస్​డీపీ వృద్ధిరేటు కనీసం మూడు శాతం ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఆ లెక్కన 2021-22 లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 17 శాతాన్ని దాటవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే ఆర్థికంగా మరింత బాగా ముందుకెళ్లవచ్చని అంటున్నారు.

రుణపరిమితి

జీఎస్​డీపీ పెరుగుదలతో రుణాలు కూడా అధికంగా తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. రుణపరిమితిని కేంద్ర ప్రభుత్వం ఈ మారు మూడు నుంచి నాలుగు శాతానికి పెంచింది. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో మాత్రమే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షరతులతో ఐదు శాతం రుణపరిమితికి అనుమతిచ్చింది. నాలుగు శాతం అనుమతి ఉండడంతోపాటు జీఎస్​డీపీ పెరుగుతున్నందున 2021-22లో రుణాలు కొంత మేర అధికంగా పొందే వెసులుబాటు కలుగుతుందని అంటున్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బడ్జెట్ ప్రతిపాదనల తయారీ ప్రక్రియ కొనసాగుతోంది.

ఇదీ చూడండి : ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కోచ్‌ ఫ్యాక్టరీ రగడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.