ETV Bharat / state

పార్టీలో పదవులు ఇచ్చేది కేసీఆర్​, కేటీఆర్​.. నేను కాదు: మంత్రి మల్లారెడ్డి

MallaReddy reaction on MLAs comments: మేడ్చల్​ జిల్లాలో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల అసంతృప్తి గళంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. పార్టీలో పదవులు ఇచ్చేది కేసీఆర్​, కేటీఆర్​ తప్ప తాను కాదని స్పష్టం చేశారు. తాను గాంధేయవాదినని.. ఎవరితో గొడవ పెట్టుకోనని చెప్పారు.

MallaReddy reaction on MLAs comments
MallaReddy reaction on MLAs comments
author img

By

Published : Dec 20, 2022, 10:28 AM IST

Updated : Dec 20, 2022, 2:20 PM IST

పార్టీలో పదవులు ఇచ్చేది కేసీఆర్​, కేటీఆర్​.. నేను కాదు: మంత్రి మల్లారెడ్డి

MallaReddy reaction on MLAs comments: పదవులు ఇచ్చేది.. కేసీఆర్​, కేటీఆర్‌ తప్ప తాను కాదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్‌ జిల్లాలో పదవుల కేటాయింపుపై నిన్న ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు.. తన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయటం పట్ల మీడియాతో ఇష్టాగోష్ఠిలో మల్లారెడ్డి స్పందించారు. తాను గాంధేయవాదినని.. ఎవరితో గొడవ పెట్టుకునే రకం కాదని తెలిపారు.

తమది క్రమశిక్షణ గల పార్టీ అని వ్యాఖ్యానించిన ఆయన.. ఇంటి సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు. జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేల వద్దకు వెళ్తానన్న మల్లారెడ్డి.. అవసరమైతే అందరినీ ఇంటికి ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. తమ మధ్య ఆ స్థాయిలో సమస్యలేదని.. కావాలనే కొందరు పెద్దది చేసి చూపుతున్నట్లు ఆరోపించారు.

"ఇది మా కుటుంబ సమస్య.. మేమందరం అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. ఏవైనా గొడవలున్నా కొద్ది కాలమే ఉంటాయి. దయచేసి ఇందులో మీడియా వాళ్లు ఎంటర్​ అవ్వద్దు. మా పార్టీలో ఏవైన సమస్యలు ఉంటే మా పార్టీ పెద్దలు ఉన్నారు వాళ్లు చూసుకుంటారు."- మల్లారెడ్డి, కార్మికశాఖ మంత్రి

ఇవీ చదవండి:

Last Updated : Dec 20, 2022, 2:20 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.