ETV Bharat / state

ఆరోజు పార్లమెంటులో మేము మాట్లాడిన వీడియోలు జీవన్​రెడ్డికి పంపించాం : వినోద్​ కుమార్ - సిలేరు విద్యుత్ ప్లాంట్​పై వినోద్ క్లారిటీ

BRS Leader Vinod Kumar Counter To Jeevan Reddy : ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్టు విషయంపై పార్లమెంట్​లో తాము మాట్లాడలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పడం సబబు కాదని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ మండిపడ్డారు. ఆయన తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆ రోజు పార్లమెంట్​లో తీవ్ర చర్చకు మేము పట్టుబట్టామని పార్లమెంట్​లో తాము మాట్లాడిన వీడియోలను జీవన్ రెడ్డికి పంపినట్లు తెలిపారు.

BRS Leader Vinod Kumar Fires on Jeevan Reddy
BRS Leader Vinod Kumar Counter To Jeevan Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 18, 2023, 3:42 PM IST

Updated : Dec 18, 2023, 4:31 PM IST

BRS Leader Vinod Kumar Counter To Jeevan Reddy : బీఆర్​ఎస్ ఎంపీలపై జీవన్​రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. భద్రాచలంలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్​లో కలిపినప్పుడు బీఆర్ఎస్ నేతలు ఏమీ చేయలేదని వారిపై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వినోద్ స్పందించారు. పార్లమెంట్​లో జరిగిన చర్చపై జీవన్​రెడ్డి మాట్లాడినవన్నీ అసత్యాలన్నారు. పార్లమెంటులో చర్చ, తన వ్యాఖ్యలు రెండూ ఒకసారి చూసుకోవాలని తెలిపారు.

2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో లెక్క చూసుకోవాలని సూచించారు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజకీయ పరిస్థితులు ఆయనకు అవగాహన అయ్యాయా లేదా అవగాహన లేకుండానే బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేసేందుకు ఇలా మాట్లాడారా అని ప్రశ్నించారు.

'బీఆర్​ఎస్​ నేతలు ఇంకా తామే అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు​ - కాళేశ్వరం అవినీతి బయటపెడతాం'

BRS Leader Vinod Kumar Fires on Jeevan Reddy : ఆరోజు సమావేశంలో ఎంత పెద్ద చర్చ జరిగిందో జీవన్​రెడ్డికి తెలుసన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా స్పందించకుండా ఉంటే మౌనమే అంగీకారం అంటారని తెలిపారు. ఆరోజు పార్లమెంటు మండలాల కోసం తీవ్రంగా పోరాడి చర్చకు దిగింది తానని చెప్పారు. ఆ రోజు జరిగిన చర్చకు సంబంధించిన వీడీయోలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఐదేళ్ల నుంచి కాంగ్రెస్, బీజేపీ వాళ్లు చేసిన వ్యాఖ్యలేనని ఆరోపించారు.

కాంగ్రెస్, బీజేపీ కలిసి ఏడు మండలాలు, సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం విషయంలో రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, ఆర్డినెన్స్ ద్వారా తీసుకెళ్లారని ఆరోజు మోదీ సభకు రాగానే తాను వ్యతిరేకించారని తెలిపారు. కేంద్రం వైఖరికి నిరసనగా కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్, ధర్నాలకు పిలునిచ్చారని గుర్తుచేశారు. ఏడు మండలాలు ఏపీలో కలిపినప్పుడు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని చెప్పారు.

Vinod Kumar On Congress Government : భూగోళం, సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం, ప్రజలకు మంచి చేస్తే తాము మద్దతు ఇస్తామన్న వినోద్ కుమార్ కేంద్రం నుంచి ఏం రావాలో రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతామని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఒక్క పనైనా చేశారా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏది పడితే అది మాట్లాడితే తాము సరిగ్గా తిప్పికొట్టకపోవడం కూడా బీఆర్ఎస్ ఓటమికి ఒక కారణమని వినోద్ అన్నారు.

మీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భగీరథ - విచారణ జరిపించాల్సిందే : ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

'రాష్ట్ర ఆర్థిక వనరులను బంగారు పళ్లెంలో అప్పగిస్తే - అప్పుల పాలు చేశారనడం సరికాదు'

శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : వినోద్‌కుమార్‌

Last Updated : Dec 18, 2023, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.