BRS Campaign in Telangana 2023 : అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ నేతలు ప్రచార జోరు పెంచారు. గులాబీ జెండాకు మద్దతివ్వాలంటూ ఊరూవాడా తిరుగుతున్నారు. ఇంటింటి ప్రచారాలు, పాదయాత్రలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
రాష్ట్రంలో మరోసారి ఐటీ దాడుల కలకలం - బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఇంట్లో అధికారుల సోదాలు
Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో మరోసారి సత్తాచాటి గులాబీ కంచుకోటగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శతాబ్దంలోని అభివృద్ధిని దశాబ్దంలోనే పూర్తి చేశామని అభ్యర్థులు ఇంటింటికి వివరిస్తున్నారు. ప్రగతి, సంక్షేమ పాలన కొనసాగాలంటే కారు పార్టీకే పట్టం కట్టాలని కోరుతున్నారు. హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అభ్యర్థి లాస్య నందిత విజయం కోసం పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలంలో సబితా ఇంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారు. కూకట్‌పల్లి అల్లాపూర్ డివిజన్‌లో మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశం జరిపారు. ఖైరతాబాద్ ఇంద్రానగర్‌లో దానం నాగేందర్ బహిరంగ సభ నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు - కేసీఆర్ చేసిన ఆ పని వల్లే : సీపీఐ నారాయణ
Telangana Assembly Elections Campaign 2023 : నిజామాబాద్ జిల్లా పోతాంగల్, కల్లూరు, జలపల్లి గ్రామాల్లో స్పీకర్ పోచారం ప్రచారం జరిపారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన పోచారానికి మహిళలు ఘన స్వాగతం పలికారు. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్‌రెడ్డి ప్రచారానికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో తరలివచ్చారు. సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మ సాగర్ భూ నిర్వాసితులు సీఎం కేసీఆర్‌కు మద్దతుగా చేసిన ఏకగ్రీవ తీర్మానం అవాస్తమని బైలాంపూర్, మామిడ్యాల, తానేదార్ పలి గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు.
BRS Election Campaign Jagtial 2023 : జగిత్యాల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారాలు నిర్వహించారు. లంబాడాల పది డిమాండ్లకు అంగీకరించిన బీఆర్ఎస్కు పూర్తి మద్దతిస్తామని లంబాడ హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా నర్సంపేటలో వెల్లడించింది. అచ్చంపేట నియోజకవర్గం గువ్వల బాలరాజు ప్రచారంలో కోలాటాలు, బోనాలు ఆకట్టుకున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో పైళ్ల రాజశేఖర్ రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. మరోవైపు ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ యువజన విభాగం వలిగొండ మండలం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని పలు గ్రామాల్లో సండ్ర వెంకట వీరయ్య బీఆర్ఎస్కు మరోసారి పట్టం కట్టాలని కోరారు.
గ్రేటర్ హైదరాబాద్‌పై బీఆర్ఎస్ ఫోకస్ - నేటి నుంచి కేటీఆర్ రోడ్ షోలు
మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు