Boy Suspicious Death in Shamshabad : కన్నవారి నిర్లక్ష్యమో లేక ఆ బాలుడి ఆయుష్షు అంత వరకే రాసి ఉందో కానీ, అప్పటి వరకు అల్లారుముద్దుగా అడుకున్న పసివాడు కానరాని లోకాలకు వెళ్లాడు. తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చాడు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు అన్ని కన్నవారు ఎప్పుడు గమనిస్తూనే ఉండాలి. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు బయటకు వెళ్లి రోడ్డు ప్రమాదాల్లో లేకా కుక్క కాట్లకో బలి అవుతున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు రోజుకి ఒక్కటైనా చూస్తున్నాం. బయటకు వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిల్లలపై కాస్త శ్రద్ధ వహించాలి. లేకపోతే వారికి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. పిల్లలను బయటకు తీసుకువెళ్లినప్పుడు అనుక్షణం వాళ్లని ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. ఏదైనా పని ఉంటే తెలిసిన వాళ్లకు అప్పజెప్పి వెళ్లాలి. అలా ఎవరికీ అప్పజెప్పకుండా.. మీ పనిలో మీరు బిజీగా ఉంటే.. ఏ క్షణమైనా ఎలాంటి ప్రమాదమైనా ముంచుకు రావొచ్చు. తాజాగా ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చోటుచేసుకుంది.
ఆడుకుంటుండగా మీద పడ్డ మెషిన్.. పాపం ఐదేళ్ల బాలుడు
Boy Suspicious Death in Shamshabad Function Hall : పెళ్లి వేడుకలకు వెళ్లిన ఏడేళ్ల బాలుడు అదృశ్యమై, అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం రోజున రంగారెడ్డి జిల్లా ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాపోలు తెలిపిన సమాచారం ప్రకారం.. నందిగామకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్హాల్లో పెళ్లికి వచ్చారు. అయనతో పాటు ఏడేళ్ల కుమారుడు అభిజిత్ రెడ్డి కూడా పెళ్లికి వచ్చాడు. మండపంలో దాండియా ఆడి సందడి చేశాడు. పెళ్లి పనుల్లో నిమగ్నమైన కుటుంబ సభ్యులు పనులన్నీ పూర్తయ్యాక.. అభిజిత్ కోసం చుశారు. తమ కుమారుడు కనిపించపోయేసరికి చుట్టుపక్కల ఆరా తీశారు. ఫంక్షన్ఎంతకీ అభిజిత్ ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విషాదం.. సాంబారులో పడి మూడేళ్ల బాలుడు మృతి
ఫంక్షన్ హాల్‌కు చేరుకున్న పోలీసులు బాలుడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా.. లేదా బయటకు వెళ్లాడా అనే కోణంలో ఆరా తీశారు. సీసీటీవీ ఫుటేజీ గమనించగా అభిజిత్ ఫంక్షన్ హాల్ వెనుక భాగం వైపునకు వెళ్తూ కనిపించాడు. పోలీసులు ఆ వైపు వెళ్లి వెతకగా తెరిచి ఉన్న మ్యాన్‌హోల్ ఒకటి కనిపించింది. అందులో చూడగా అందులో అభిజిత్ విగత జీవిగా కనిపించాడు. వెంటనే బాలుడి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. సరదాగా ఆడుకుంటాడని పెళ్లికి తీసుకువస్తే.. ఇలా చనిపోయాడేంటని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
అభిబిత్ మరణంతో.. అప్పటి దాకా పెళ్లి సందడి, భాజాభజంత్రీలు మోగిన వేడుకలో ఒక్కసారిగా విషాద చాయలు అలుముకున్నాయి. ఫంక్షన్ హాల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడడంతో.. పోలీసులు రంగంలోకి దిగి.. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో అభిజిత్ కుటుంబ సభ్యులు శాంతించారు. ఫంక్షన్‌హాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.