ETV Bharat / state

Boy Kidnapping Case : ఆన్​లైన్​ ట్రేడింగ్​లో నష్టపోయారు.. చిన్నారిని కిడ్నాప్​ చేశారు.. చివరికీ?

Malkajigiri Boy Kidnapping Case Update : ఆన్​లైన్ ట్రేడింగ్​లో నష్టపోయిన ఇద్దరు యువకులు, అప్పుల నుంచి బయటపడటానికి బాలుడిని అపహరించారు. ఇంటి పక్కనే ఉండే బాలుడిని అపహరించి రూ.2కోట్లు డిమాండ్ చేశారు. పోలీసులకు చిక్కకుండా డిజిటల్ సిమ్ కార్డుతో బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో చాకచక్యంగా పోలీసులు కిడ్నాపర్లను అరెస్టు చేశారు.

Boy Kidnapping
Boy Kidnapping
author img

By

Published : Jun 17, 2023, 7:40 PM IST

Police Sloved Boy Kidnapping Case In Malkajigiri : మల్కాజిగిరిలో 15వ తేదీన ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడు కనిపించకుండా పోయాడు. చీకటి పడినా ఇంకా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి కిడ్నాప్​ కథను సుఖాంతం చేశారు. ఈ మేరకు డీసీపీ ధరావత్​ జానకి సమావేశం నిర్వహించి.. కేసును ఛేదించిన విధానాన్ని వివరించారు.

హైదరాబాద్​ మల్కాజిగిరి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని సప్తగిరి కాలనీలో నివాసం ఉంటున్న స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస్​ కుమారుడు హర్షవర్ధన్​ను శివ అనే నిందితుడు అపహరించడానికి పథకం రచించాడు. దీని కోసం శివ తన సోదరుడు రవి, స్నేహితులు మహిపాల్​, దిలీప్​ సాయం తీసుకున్నాడు. దాదాపు నెల రోజుల నుంచి ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. చివరకు ఈనెల 15వ తేదీన ఆడుకుంటూ ఉండగా మాయమాటలు చెప్పి కారులో అపహరించుకుపోయారు.

Boy Kidnapping Case In Malkajigiri : సప్తగిరి కాలనీ నుంచి బయలుదేరిన కారు తార్నాక్​ సమీపంలో బాల నేరస్థుడిని దించేసి.. నిందితులు 13 ఏళ్ల బాలుడిని మాత్రం తమ వెంట తీసుకెళ్లారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులకు వాట్సాప్​ ద్వారా ఫోన్​ చేసి.. రూ.2 కోట్లను డిమాండ్​ చేశారు. ఈ విషయం పోలీసులకు చెబితే బాలుడిని చంపేస్తామని బెదిరించారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ప్లే స్టోర్​ నుంచి పలు అఫ్లికేషన్లు డౌన్​లోడ్​ చేసుకొని.. అంతర్జాతీయ ఫోన్​ కాల్స్​లా వారిని నమ్మించి భయపెట్టారు. అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సీసీ కెమెరాలు, నిందితులు ఉపయోగించిన కారు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించామని డీసీపీ చెప్పారు.

ఆన్​లైన్​ ట్రేడింగ్​లో నష్టమే.. ఈ కిడ్నాప్​కు కారణం : నిందితుడు శివ షేర్​ మార్కెట్​లో ఆన్​లైన్​ ట్రేడింగ్​ నిర్వహిస్తుంటాడు. అతని సోదరుడు రవి సైతం అదే బాటలో పయనించి.. రూ.4 లక్షలు దాకా నష్టపోయారు. అప్పుల నుంచి తేరుకోవడానికి ఇద్దరూ కలసి బాలుడిని అపహరించాలని కుట్ర పన్నారు. ఇందుకోసం స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస్​ కుమారుడైతే మేలని భావించి.. అదే కాలనీకి చెందిన మహిపాల్​తో పాటు మహబూబాబాద్​కు చెందిన దిలీప్​ సాయం తీసుకున్నారు.

Boy Kidnapping Case Update : కిడ్నాప్​ తర్వాత వచ్చిన డబ్బులో రూ.20 లక్షలు ఇస్తానని వారికి ఆశ చూపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు 5 బృందాలుగా విడిపోయి.. గాలించారు. సాంకేతికతను కూడా ఉపయోగించుకొని పాలకుర్తిలో బాలుడిని గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని.. బాలుడిని సురక్షితంగా హైదరాబాద్​కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. 36 గంటల్లోనే ఈ కేసును పోలీసులు ఛేదించడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.