విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ రాసిన 'యువ న్యాయవాదుల విజయానికి మార్గదర్శకాలు' పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో విశ్రాంత సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరించారు. జెసికె లా అసోసియేట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి, జస్టిస్ వామనరావు, జస్టిస్ యతిరాజులతో పాటు కేంద్ర సమాచార పూర్వ కమిషనర్ మాడభూషి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాది వృత్తిలోకి వచ్చే వారికి కావాల్సిన అన్ని అంశాలతో పాటు నేటి సమాజంలో ఉన్న అన్ని కోణాలను జస్టిస్ చంద్రకుమార్ ఈ పుస్తకంలో పొందుపరిచారని పలువురు న్యాయమూర్తులు తెలిపారు. కోర్టులో న్యాయవాది వాదించి గెలవడమే కాకుండా సమాజంలోని వారికి సరైన న్యాయసలహాలు ఇవ్వడం మంచి న్యాయవాది లక్షణమన్నారు.
ఇదీ చదవండిః హైదరాబాద్‌లోని చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్