తెలంగాణ సంస్కృతి ఖండంతరాలకు విస్తరించింది. లండన్లోని తెలంగాణ వారు బోనాల పండుగను నిరాడంబరంగా నిర్వహించారు. టాక్(తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్) కార్యవర్గ సభ్యులు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ స్థానిక గుడిలో అమ్మవారికి బోనాలను సమర్పించి అందరినీ చల్లగా చూడాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిద్ధారెడ్డి, తెలంగాణ సమాచారహక్కు చట్టం కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. తెలంగాణ బోనాల పాటలతో ప్రముఖ గాయని స్వాతి రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వారిని అలరించారు. నిరుడు ప్రత్యేకంగా అమెరికా నుంచి వచ్చి పోతరాజు వేషధారణతో లండన్ వీధుల్లో ధూమ్ ధామ్ చేసిన జయ్ కూడా వీడియో కాన్ఫరెన్స్లో పోతరాజు వేషధారణతో అమెరికా నుంచి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన