ఏటా ఆషాడమాసం మొదటి మంగళవారం జరిగే అమ్మవారి కల్యాణ ఉత్సవాలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వం తరఫున మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దేశ నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తలసాని తెలిపారు. సోమవారం గణపతి పూజతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయన్నారు. బుధవారం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎంవీ శర్మ వెల్లడించారు.
- ఇదీ చూడండి : నిబంధనలు లేని పబ్‌లు... ఆందోళనలో నగరవాసులు