మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరి, నేరేడ్మెట్, కుషాయిగూడలో బోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవాలయలకు భక్తులు భారీగా పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయాలకు చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: అమ్మవారికి బంగారుబోనం సమర్పించిన పీవీ సింధు