Extra Mile's charity: అనారోగ్య సమస్యలతో జన్మించే శిశువులను ఆదుకొనేందుకు ఏర్పాటుచేసిన ‘ఎక్స్‌ట్రా మైల్’ స్వచ్ఛంద సంస్థను ... ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, బాలీవుడ్ సినీనటి కరిష్మాకపూర్ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో ప్రారంభించారు. కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బంది సేవలు మరువలేనివని కరిష్మాకపూర్ తెలిపారు. అందుకే వైద్యులను దేవునితో సమానమంటారని పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని ఆమె సూచించారు.
సరైన వైద్యం అందడంలేదు...
పేద, మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన చిన్నారులు అరుదైన వ్యాధుల బారిన పడినప్పుడు వారికి సరైన వైద్యం అందడంలేదని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. అలాంటి చిన్నారుల కోసం ఖరీదైన వైద్యం అందించేందుకు ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టార్ ఆసుపత్రి సీఎండీ గోపిచంద్ మన్నెం, రెయిన్ బో ఆసుపత్రి సీఎండీ కంచర్ల రమేష్, ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రి సీఎండీ డా.జి.ఎన్.రావు, ఎక్స్‌ట్రా మైల్ సంస్థ వ్యవస్థాపకులు నీరూ కుమార్, ప్రియా కుమార్ సభ్యులు డా.నిటాషా భగ్గా, డా.ఏజీకె గోఖలే, పలువురు ప్రముఖులు సి.రమాదేవి, అతుల్ కుమార్ అగర్వాల్, ప్రియా కుమార్, అంబికా భారి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అయ్యో హంస నందిని.. ఈ పెద్ద రోగం నీకు తగిలిందా!