దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన అమర జవాన్లు ర్యాడ మహేష్, ప్రవీణ్‌కుమార్ రెడ్డిల ఆత్మకు శాంతి చేకూరాలని బీజేవైఎం రాష్ట్ర నాయకులు పవన్ కుమార్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ నుంచి సర్దార్ పటేల్ నగర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ విచ్చేసి మాట్లాడారు.
సరిహద్దుల్లో చొరబాటుదారులతో పోరాడి వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. వారి ఆశయ సాధన కోసం యువత ముందుకు సాగాలని, వారి దేశభక్తిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు దేశ సేవ చేయాలని ఆయన సూచించారు. యావత్ భారతదేశం వారి త్యాగాలకు చిరకాలం రుణపడి ఉంటుందన్నారు.
ఇవీ చూడండి: వీరజవాన్ల పార్థీవదేహాలకు ప్రముఖుల నివాళులు...