ETV Bharat / state

కేసీఆర్‌ మునిగే పడవను ప్రశాంత్ కిశోర్‌ కాపాడలేరు: తరుణ్​ చుగ్​ - tharun chug comments on pk

Tharun Chug comments on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి తరుణ్‌చుగ్‌ అన్నారు. పీకే లాంటి వాళ్లు భాజపాను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. తమ పోరాటం కేసీఆర్​తో కాదని.. తెలంగాణను కాపాడేందుకేనని స్పష్టం చేశారు.

tharun chug
తరుణ్​ చుగ్​
author img

By

Published : Feb 28, 2022, 5:34 PM IST

Tharun Chug comments on CM KCR: ప్రశాంత్‌ కిశోర్‌ లాంటి వారు భాజపాను ఏమీ చేయలేరని.. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి తరుణ్‌ చుగ్‌ స్పష్టం చేశారు. కుటుంబ రాజకీయాలు చేసే వారికే అలాంటి వారి అవసరం ఉంటుందని ఎద్దేవా చేశారు. భాజపాకు చెందిన ప్రతి కార్యకర్తకు ఎన్నికల్లో ఎలా గెలిపించాలో తెలుసని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్​ బర్కత్​పురాలో పార్టీ స్థానిక కార్యకర్తలు, నేతలతో సమావేశమైన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దుష్టపాలనకు, రాష్ట్రాన్ని కాపాడేవారికి మధ్య పోరు జరుగుతోందని తరుణ్​ చుగ్​ అన్నారు. సీఎం కేసీఆర్​ది కేవలం పొలిటికల్‌ టూరిజం మాత్రమేనని.. దానివల్ల భాజపాకు ఎలాంటి నష్టం లేదని వ్యాఖ్యానించారు.

చెల్లని పైసా

"కేసీఆర్‌ది కేవలం పొలిటికల్‌ టూరిజం. దిల్లీలో రోజు ఎన్నో విమానాలు దిగుతాయి. కేసీఆర్‌ దిగడం వల్ల నష్టమేం లేదు. ఇక్కడ చెల్లని పైసా.. దిల్లీలో ఏం చేయలేదు. కేసీఆర్‌ది చెల్లని పైసా. భాజపాను ప్రశాంత్​ కిశోర్​ ఏమీ చేయలేరు. మాకు బూతు స్థాయి కార్యకర్తలే పీకేలు." -తరుణ్​ చుగ్​, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి

దేశానికే కాదు

కేసీఆర్‌ తన అవినీతి, జుగుప్సాకర పనులను కప్పిపుచ్చుకునేందుకు అబద్ధాలు చెబుతున్నారని తరుణ్​ చుగ్​ ఆరోపించారు. ఆ అబద్ధాలతోనే రాజకీయాలు చేస్తున్నారని.. అవి పూర్తిగా విఫలం కానున్నాయని జోస్యం చెప్పారు. ఆయన​ ముఖం ఆయనే చూసుకుని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్​ మునిగే పడవను ప్రశాంత్​ కిశోర్​ కాపాడలేరన్న చుగ్​.. ముఖ్యమంత్రి దుష్ట పాలనను ప్రజలు అంతం చేయాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు. పొలిటికల్​ టూరిస్టు లాగా తిరుగుతున్న కేసీఆర్​.. దేశానికే కాదు ఉక్రెయిన్​కు కూడా ప్రధాని అవుతారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

కేసీఆర్‌ తన ముఖం తానే చూసుకుని భయపడుతున్నారు: తరుణ్​ చుగ్​

ఇదీ చదవండి: Telangana Budget Sessions 2022-23 : మార్చి 7 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.