తెలంగాణ రైతాంగం కోసం ప్రాణాలొడ్డి పోరాడిన జాటోతు టాను నాయక్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన జాటోతు టాను నాయక్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. టాను నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంజయ్‌తో పాటు భాజపా శ్రేణులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పోడు రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు భాజపా పోరాటం ఆగదని సంజయ్ స్పష్టం చేశారు. నేటి తెరాస పాలన నాటి రజాకార్ల పాలనను తలపిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఈ నియంత పాలన నుంచి త్వరలోనే ముక్తి లభిస్తుందని అన్నారు.
- ఇదీ చదవండి : కమిటీల నివేదిక తర్వాత నిర్ణయం: హరీశ్ రావు