భైంసా ఘటనలపై ప్రభుత్వ నివేదిక కోరాలని గవర్నర్ తమిళిసైకు భాజపా నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలో పోలీసులు అమాయకులను ఇబ్బంది పెడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బృందం గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది.
రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఆయన నేతృత్వంలోని భాజపా నేతలు కలిశారు. భైంసా అల్లర్లపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పోలీస్ వ్యవస్థను ఎంఐఎం చేతుల్లో పెట్టిందని.. ఆ పార్టీకి అనుగుణంగానే పదోన్నతులు జరుగుతున్నాయని ఆరోపించారు.
అందువల్లే పోలీసులు ఒక వర్గానికి అనుగుణంగా పనిచేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పటికీ ఎవరు మాట్లాడటం లేదని విమర్శించారు. 12 ఇళ్లు దగ్ధమైనా పరిహారం ఇవ్వడం లేదని... మండిపడ్డారు.