BANDI SANJAY LETTER: యాసంగి వడ్ల కొనుగోలు డబ్బు రైతాంగానికి వెంటనే చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రైతుబంధు పథకం నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు. యాసంగిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోనే రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లకు 517.16 కోట్ల రూపాయలు రాష్ట్రప్రభుత్వం ఇంకా చెల్లించాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఫామ్‌హౌజ్ నుంచి బయటకి వచ్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించాలని కోరారు.
ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు వంటి విషయాలలో వ్యవసాయశాఖ మొద్దునిద్ర వీడే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రైతుసంఘాలతో, అన్నీ రాజకీయ పార్టీలతో రైతాంగ సమస్యలపై జిల్లా కలెక్టర్లు సమావేశాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్ ప్రారంభమైనందున రైతులకు రైతుబంధు నిధులు వెంటనే చెల్లించాలని లేఖలో కోరారు.
ఇవీ చదవండి:
'సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అలర్లలో పాల్గొన్న యువకుడు ఆత్మహత్యాయత్నం
శివసేన కీలక సమావేశం.. గైర్హాజరయ్యే ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు!