సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు సంతోషం కలిగించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. అయోధ్యలో వివాదాస్పద స్థలం కూల్చివేత కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థపై గౌరవంతో భాజపా అగ్రనేతలు న్యాయస్థానం తీర్పుకోసం నిరీక్షించారని తెలిపారు. సత్యమేవ జయతే అనే సూత్రాన్ని విశ్వసించే నేతలుగా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుంటూ విచారణకు సహకరించారన్నారు.
జైలు జీవితం కూడా గడిపారని సంజయ్ వివరించారు. అద్వానీ, మురళీమనోహర్ జోషి, కల్యాణ్ సింగ్, ఉమాభారతి సహా సాధు సంతులు నిర్దోషులుగా తేలారన్నారు. కొందరు రాజకీయ పార్టీల నేతలు చేసిన ఆరోపణలు నుంచి ఈ రోజు సచ్చీలులు ఉపశమనం పొందారని తెలిపారు.
ఇదీ చదవండి: 'బాబ్రీ కేసులో నిందితులు అందరూ నిర్దోషులే'