భాజపా మేనిఫెస్టోను అమలు చేసి ఇంటింటికి తిరిగి చెబుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆటో డ్రైవర్లకు ఏటా రూ.7వేలు ఇస్తామన్న ఆయన... 125 గజాలలోపు ఇల్లు కట్టుకునేందుకు అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు. నగరంలో ఉచితంగా నల్లా కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. మహిళలకు మెట్రోలో, సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తామన్నారు.
"రాష్ట్రంలో భాజపాను మతతత్వ పార్టీగా చిత్రీకరించే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. హిందువునని చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్... ఎంఐఎంతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. మత కల్లోలాలు చేసేదెవరూ? చేయించేదెవరూ? ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. రాష్ట్రంలో మత విద్వేషాలు రగిలించడానికి సీఎం పథకం రచిస్తున్నాడు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు... అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు"
--- ప్రచారంలో బండి సంజయ్
ఇదీ చూడండి: 'పొలిటికల్ టూరిస్టులతో ఒరిగేదేం లేదు... మేయర్ పీఠం తెరాసదే'