ETV Bharat / state

'భాజపాలో చేరికల సంఖ్య పెద్దది.. ఇది ట్రైలర్‌ మాత్రమే.. సినిమా ముందుంది' - bandi sanjay on cm kcr

భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌ చుగ్‌ను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ కలిశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన బండి... వారితో భేటీ అయ్యారు.

Bandi live
Bandi live
author img

By

Published : Aug 6, 2022, 3:35 PM IST

Updated : Aug 6, 2022, 3:58 PM IST

'భాజపాలో చేరికల సంఖ్య పెద్దది.. ఇది ట్రైలర్‌ మాత్రమే.. సినిమా ముందుంది'

Bandi sanjay comments: తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. దిల్లీలో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ను కలిసిన బండి, దాసోజు శ్రవణ్... ఇది సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. విద్యార్థి పరిషత్‌లో పనిచేసిన శ్రవణ్.. నాతో భేటి అవడం హర్షణీయమన్నారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చించామని తెలిపారు.

తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం దోచుకుంటోందని ఆరోపించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని పేర్కొన్నారు. కానీ భాష హద్దు మీరితే ప్రజలు సహించరని వెల్లడించారు. కేసీఆర్, ఆయన కుటుంబం మాట్లాడే భాష చూసి.. దేశం మొత్తం అసహించుకుంటుందని అభిప్రాయపడ్డారు. చిల్లర రాజకీయాలు చేస్తూ... చిల్లర కుటుంబంగా మారిందని విమర్శించారు. కేసీఆర్‌ను దేశవ్యాప్తంగా ప్రజలు ఎలా అసహించుకుంటున్నారో.. దాన్ని చూసైనా మిగతా రాజకీయ పార్టీల వాళ్లు గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు.

bandi sanjay on rajagopal : ఇక రాజగోపాల్‌రెడ్డి కొత్త కాంట్రాక్టర్ ఏమి కాదని... ఆయనే స్వయంగా తనో కాంట్రాక్టర్ అని ఒప్పుకున్నట్లు గుర్తు చేశారు. అయితే భాజపాకు డబ్బులిచ్చి.. నాయకులను చేర్చుకునే సంస్కృతి తమకు లేదని స్పష్టం చేశారు. ఆ అలవాటు తెరాస, కాంగ్రెస్‌లకు ఉంటాయని ఆరోపించారు.

కేసీఆర్, సోనియాను తిట్టినవాళ్లే... కాంగ్రెస్‌ పార్టీలో నాయకులు అయ్యారు. రాజగోపాల్‌రెడ్డి చేరితే తప్పేంటి? అయితే వెంకట్‌రెడ్డి చేరుతారో లేదో .. ఆయన్నే అడిగి చెప్తా... దాసోజు శ్రవణ్.. కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశారు. కానీ సరైన ఫలితం ఆయనకు దక్కలేదు. విద్యార్థి స్థాయి నుంచి ఆయన కష్టపడి వచ్చారు. ఆయన ఎప్పుడు చేరుతారో త్వరలో ప్రకటిస్తాం. - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

tarun chug on trs: ప్రజల ఆశలను తెరాస ప్రభుత్వం వమ్ము చేస్తోందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌ చుగ్‌ అన్నారు. తెరాసకు ప్రజలు గుడ్‌బై చెప్పనున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ అధికారం కోల్పోతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ ఇంటెలిజెన్స్‌ కూడా ఇదే చెప్తోందని అన్నారు. భాజపాలో చేరే వాళ్ల సంఖ్య పెద్దది.. ఇది ట్రైలర్ మాత్రమే... సినిమా ముందుంది... అని వివరించారు.

Last Updated : Aug 6, 2022, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.