ETV Bharat / state

జూబ్లీహిల్స్ అత్యాచారంపై సీబీఐ విచారణ జరిపించాలి: బండి సంజయ్‌

Bandi Sanjay Letter To Kcr: మైనర్‌ బాలికపై హైదరాబాద్‌లో జరిగిన అత్యాచారంపై సీబీఐ విచారణ జరిపించాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

బండి సంజయ్‌
బండి సంజయ్‌
author img

By

Published : Jun 4, 2022, 1:10 PM IST

Updated : Jun 4, 2022, 2:08 PM IST

Bandi Sanjay Letter To Kcr: మైనర్‌ బాలికపై హైదరాబాద్‌లో జరిగిన అత్యాచారంపై సీబీఐ విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. బాలికపై అత్యాచార ఘటనపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. నిందితులను రక్షించడానికి పోలీస్‌శాఖ కేసును పక్కదోవ పట్టిస్తోందని ఆరోపించారు.

అఖిలపక్ష భేటీ నిర్వహించాలి: బాలికపై అఘాయిత్యం కేసులో ఎలాంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా.. నిందితులకు అండగా లేమనే అపవాదును తొలగించుకోవాలని సీఎం కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు. పలుకుబడిన వారి కుటుంబసభ్యుల ప్రమేయం ఉన్న ఘటనలో పోలీసులు నిష్పాక్షికంగా ఎలా దర్యాప్తు చేయగలరని ప్రశ్నించారు. బాలికపై అత్యాచారం కేసులో సీబీఐతో విచారణ జరిపించకపోతే న్యాయపోరాటం చేసి బాధితులకు అండగా ఉంటామన్నారు. రాష్ట్రంలోని పబ్బులను మూసివేయాలని కోరారు. శాంతిభద్రతల సమస్యపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

'ఎంఐఎం నేతలకు సంబంధం ఉంది': జూబ్లీహిల్స్ పరిధిలో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలు కొన్నింటిని మీడియా ముందు బయటపెట్టారు. తమ వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని పోలీసులకు, న్యాయస్థానానికి అందచేస్తామని తెలిపారు.

అత్యాచారం కేసులో నిందితులు ఎవరైనా వారిని కఠినంగా శిక్షించాలంటూ కేటీఆర్ ట్వీట్‌ చేశాకే.. పోలీసులు వేగంగా స్పందించారని పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. నిందితులను కాపాడే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అత్యాచారం ఒక కారులో జరిగితే మరో కారులో ఉన్న వారిని అరెస్ట్ చేస్తున్నారని రఘునందన్‌ రావు అనుమానం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. ఐదుగురు నిందితులు అరెస్టు

'స్పైడర్ మ్యాన్' సాహసాలతో వరుస చోరీలు.. అడ్డంగా కెమెరాకు చిక్కి..!

Last Updated : Jun 4, 2022, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.