ETV Bharat / state

BANDI SANJAY: 'వైద్య శాఖ పటిష్ఠం కోసం చర్యలు తీసుకోండి' - telangana latest news

గాంధీ ఆసుపత్రిలో తొలగించిన పొరుగు సేవల సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. వైద్యారోగ్య శాఖ పటిష్ఠం కోసం తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని కోరారు.

BANDI SANJAY: 'వైద్య శాఖ పటిష్ఠం కోసం చర్యలు తీసుకోండి'

author img

By

Published : Jul 6, 2021, 7:44 PM IST

గాంధీ ఆసుపత్రిలో పొరుగు సేవల సిబ్బందిని అర్ధాంతరంగా తొలగించడం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యల వల్ల 1,700 మంది వరకు నర్సులు నడిరోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం రోడ్డెక్కిన పొరుగు సేవల సిబ్బందిపై పోలీసులు లాఠీలు ఝుళిపించి, అరెస్టు చేయడం దారుణమన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

కరోనా కష్టకాలంలోనూ ప్రాణాలకు తెగించి.. రాత్రింబవళ్లు రోగులకు సేవలందించిన నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చే నజరానా ఇదేనా? అని మండిపడ్డారు. కనీసం ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నర్సులను ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమన్నారు. వెంటనే ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన ప్రభుత్వం.. పొరుగు సేవల ఉద్యోగులనూ బజారున పడేయడం శోచనీయమన్నారు. వైద్యారోగ్య శాఖ పటిష్ఠం కోసం తక్షణమే ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది పోస్టులన్నీ భర్తీ చేయాలని బండి డిమాండ్​ చేశారు.

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి..

సచివాలయంలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన దళిత సాధికారత సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారం తక్షణమే పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరుతూ భాజపా ఎస్సీ మోర్చా, బీజేవైఎం నాయకులు బండి సంజయ్‌ను కలిశారు. వెంటనే స్పందించిన బండి సంజయ్.. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు.

2018 డిసెంబర్ 11న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడం దురదృష్టకరమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లేఖలో ప్రస్తావించారు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి..

Bandi sanjay: 299 టీఎంసీల కోసం అపెక్స్ కౌన్సిల్​లో కేసీఆర్​ సంతకం చేశారు

Bandi Sanjay: కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయండి.. కేంద్రానికి బండి సంజయ్​ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.