దేశ రాజధాని దిల్లీ సర్వోతముఖాభివృద్ధి చెందాలంటే భాజపా ప్రభుత్వం రావాలన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా... దేశ రాజధానిలో స్థిరపడిన దక్షిణాది మేధావులు, నిపుణులతో ఆంధ్రా అసోసియేషన్లో రాంమాధవ్ సమావేశమయ్యారు. కేజ్రీవాల్ చేసిన దానికంటే ఎక్కువ చేసే సత్తా భాజపాకే ఉందని.. దిల్లీలో జరుగుతున్న ఆందోళనల వెనక ఆమ్ ఆద్మీ పార్టీ ఉందని రాంమాధవ్ ఆరోపించారు.
నాలుగేళ్ల వరకు కేంద్ర అభివృద్ధిని అడ్డుకుందని ప్రచారం చేసిన కేజ్రీవాల్ .. ఇప్పుడు మాట మార్చి ఐదేళ్లు బాగా పని చేశామని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మేధావులు, నిపుణులు భాజపాకి మద్దతు ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో దిల్లీ భాజపా ఎంపీ మీనాక్షి లేఖి, తెలుగు, తమిళ, కన్నడ, మళయాల నిపుణులు, మేధావులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: తెలంగాణ కుంభమేళాకు జాతీయ హోదా దక్కేదెప్పుడు?