ETV Bharat / state

bjp: తెరాసపై రాజకీయ కురుక్షేత్రానికి సిద్ధమవుతున్న కమలనాథులు - తెలంగాణ వార్తలు

అధికార తెరాసపై రాజకీయ కురుక్షేత్రానికి కమలనాథులు సిద్ధమవుతున్నారు. తెరాసకు దీటుగా భారతీయ జనతా పార్టీ ప్రతివ్యూహాలు రచిస్తోంది. ఈటల రాజేందర్ ఇవాళ కాషాయ కండువా కప్పుకున్న వెంటనే... హుజూరాబాద్​లో తన ప్రణాళికలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. దుబ్బాక తరహాలోనే హుజురాబాద్‌లో కాషాయజెండా ఎగరేసేందుకు సిద్ధమవుతోంది. 2023 ఎన్నికలకు ముందు హుజురాబాద్‌లో విజయం సాధించి.. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే అనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వ్యూహరచనలో నిమగ్నమైంది.

bjp, trs
భాజపా, తెరాస
author img

By

Published : Jun 14, 2021, 3:18 PM IST

రాష్ట్రంలో రాజకీయాలు మళ్లీ ఊపందుకున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న కమలనాథులు.. అందుకు తగిన ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్‌ అందుకు అనుగుణంగా వేగంగా పని చేస్తున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు కొంత విరామం ఇచ్చిన భాజపా రాష్ట్ర నాయకత్వం.. మళ్లీ ముమ్మరం చేసింది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన వెంటనే ఈటల రాజేందర్‌ను భాజపాలోకి లాగేందుకు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ ఛైర్మన్ తుల ఉమలు.. ఇవాళ జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు‌. ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని సాధ్యమైనంత త్వరగా... భాజపాలోకి తీసుకురావాలని యోచిస్తోంది. గతంలో చర్చలు జరిపి నిశ్శబ్థంగా ఉన్న కమలనాథులు ఈటలతో పాటు.. వీళ్లను సైతం భాజపాలోకి రావాలంటూ పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఒక కొలిక్కి మాత్రం రాలేదు. తెరాసలోని అసంతృప్తులు, మాజీ ఎమ్మెల్యేలను... భాజపాలో చేర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.

ప్రతివ్యూహాలపై కసరత్తు

హుజూరాబాద్ ఉప ఎన్నికను భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అధికార తెరాస, కేసీఆర్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలను కమలనాథులు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. హుజూరాబాద్​కు ఉప ఎన్నిక వస్తే... ఈటల రాజేందర్​కు సరితూగే నేత తెరాసలో లేరని.. భాజపా నేతలు చెబుతున్నారు. గత 17 ఏళ్లుగా ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా నిర్ణయించింది.

హుజూరాబాద్​లో పాగా

తెరాసతో భాజపాకి ఎలాంటి స్నేహం లేదని.. ఇదే అంశంపై ప్రజల్లో ఉన్న అపోహలను వీలైనంత త్వరగా తొలగించాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇంకోవైపు తెరాస ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించాల్సిందిగా జాతీయ నాయకత్వాన్ని కోరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ జరిపితేనే భాజపాపై ఉన్న అపోహలు తొలగిపోతాయని... పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బంగాల్లో మమతా బెనర్జీ అరాచకాలను ఎదుర్కొన్నట్లు.‌. తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలను ఎదుర్కోవాలని కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. బంగాల్లో 3 అసెంబ్లీ స్థానాల నుంచి.. 70కి పైగా సీట్లు గెలిచినట్లే తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల్లో 70 స్థానాలు లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని రాష్ట్ర నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ముందుగా హుజూరాబాద్​లో పాగా వేయాలని భావిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘనందన్‌రావు బలమైన అభ్యర్థికావటం భాజపాకు కలిసొచ్చిందని.. అదే మాదిరిగా హుజూరాబాద్​లో సైతం ఈటల రాజేందర్ తమకు బలమైన అభ్యర్థి అవుతారని కమలనాథులు భావిస్తున్నారు.

తెరాసకు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్న కమలనాథులు... క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై పోరాటానికి సన్నద్ధం అవుతున్నారు.

ఇదీ చదవండి: ప్రేయసి గొంతు నులిమి నదిలో పడేసిన మైనర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.