రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ ఆరోపించారు. మహిళలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నా... ప్రభుత్వం చూసీచుడనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మద్యం అమ్మకాలపై పెట్టిన దృష్టి... మహిళల భద్రతపై పెట్టడంలేదని ఆరోపించారు. భాజపా ఆధ్వర్యంలో మాదాపూర్ హైటెక్ సిటీ చౌరస్తాలో 'జస్టిస్ ఫర్ దిశ' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ పాల్గొన్నారు. శిల్పకళా వేదిక నుంచి మాదాపూర్ పోలీస్‌స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం కింద రూ.3 వేల కోట్లు కేటాయిస్తే... కనీసం రూ.200 కోట్లు కూడా ఖర్చు చేయలేదని లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి: దిశ కేసులో ముందడుగు.. ఫాస్ట్‌ట్రాక్ ఏర్పాటుకు హైకోర్టు ఆమోదం