ETV Bharat / state

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు గుణపాఠం చెప్పాలి: ఎంపీ అర్వింద్

author img

By

Published : Nov 23, 2020, 4:32 PM IST

గ్రేటర్​ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ భాజపా దూసుకెళ్తోంది. జగద్గిరిగుట్ట అభ్యర్థి మహేష్​ యాదవ్​ తరపున నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

bjp mp arvind election compaign in ghmc
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు తగిన బుద్ధి చెప్పాలి: ఎంపీ అర్వింద్

జీహెచ్​ఎంసీలో గెలుపే లక్ష్యంగా భాజపా ప్రచారం ముమ్మరం చేసింది. జగద్గిరిగుట్ట భాజపా అభ్యర్థి మహేష్ యాదవ్ తరపున నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలు వరదల్లో చిక్కుకుంటే సాయం అందించలేని ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధిచెప్పాలన్నారు. ఆరేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.

ఎన్నికలకు మరో మూడు నెలలు సమయముండగా ఆగమేఘాల మీద పెట్టాల్సిన అవసరమేంటని మండిపడ్డారు. రెండు పడక గదుల ఇళ్లు, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయి అని ధ్వజమెత్తారు. గ్రేటర్ అభివృద్ధికి భాజపాకు గెలిపించాలని ఎంపీ అర్వింద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:'ప్రధాన కేంద్రాల నుంచి విమానాశ్రయానికి మెట్రో రైలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.