ETV Bharat / state

BJP: కేంద్రాన్ని విమర్శిస్తే అదేస్థాయిలో సమాధానమిస్తాం: రఘునందన్​ రావు - దుబ్బాక ఎమ్మల్యే రఘునందన్​ రావు

రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. కేంద్రంపై అనవసరంగా నోరు పారేసుకుంటే తాము అదేరీతిలో సమాధానమిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్​లోని​ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

BJP MLA Raghunandan rao
భాజపా ఎమ్మెల్యే రఘునందన్​రావు
author img

By

Published : Jun 21, 2021, 6:28 PM IST

Updated : Jun 21, 2021, 7:16 PM IST

బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉండి కేంద్రంపై అనవసరంగా విమర్శలు చేయొద్దని దుబ్బాక ఎమ్మల్యే రఘునందన్​ రావు ముఖ్యమంత్రి కేసీఆర్​కు హితవు పలికారు. భాజపాను తిట్టడానికి అధికార వేదికలను ఉపయోగించుకోవద్దని ఆయన సూచించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు కేంద్రం నిధులిస్తోందని తెలిపారు. హైదరాబాద్​లోని​ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి ఆయన తెరాస ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

హుజూరాబాద్​ ఉపఎన్నికతో పీఠాలు కదిలిపోతాయనే భయంతోనే సీఎం కేసీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని రఘునందన్‌ రావు ఆరోపించారు. కృష్ణా జలాల నివేదిక కోరితే ప్రభుత్వం మాట దాట వేసిందని ఆక్షేపించారు. దేశంలో వరిధాన్యం తాము మాత్రమే కొనుగోలు చేస్తున్నామని అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. గ్రామ పంచాయితీలకు ఇచ్చిన నిధుల్లో లక్షకు 90 వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేనని తెలిపారు.

వైకుంఠధామాల నిర్మాణాల్లో నిధులన్నీ కేంద్రానివేనని చెప్పారు. రైతు వేదికలపై మోదీ బొమ్మ వేయకుండా గులాబీ రంగులు వేశారని విమర్శించారు. వరిధాన్యం కేవలం కేసీఆర్ కొనుగోలు చేసినట్లే చెబుతున్నారని.. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశారని ఆయన వివరించారు.

రాష్ట్రంలో సిద్దిపేట, గజ్వేల్‌ నియోజకవర్గాలే ఉన్నట్లు సీఎం వ్యవహారిస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ధ్వజమెత్తారు. సీఎం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారని... భాజపాను లక్ష్యంగా చేసుకుని తెలంగాణను తామే అభివృద్ది చేసినట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తన క్యాంపు కార్యాలయ నిర్మాణానికి ఇప్పటి వరకు నిధులు రాలేదన్నారు.

మీరు ఏ పదం వాడితే మేము అదేరీతిలో బదులిస్తాం. సీఎం సార్ కొంత మీ భాష మార్చుకోండి. మీకంటే మేము కూడా బాగానే తిట్టగలం. కానీ మీ సీఎం కుర్చీ, వయసును గౌరమిస్తున్నాం. రైతు బంధు వద్దని మేం చెప్పలేదు. రైతు బీమా వద్దనేదెవరు ఏ ఒక్క పార్టీ పేరు చెప్పు. సీఎం పదవిలో ఉండి మీరు మాట్లాడే భాష సరిగా లేదు. ప్రొఫెసర్ జయశంకర్​ తెలంగాణ కోసం పోరాడిండు. ఏనాడు ఆయన కూడా ఆయన నోరు జారలేదు. ఇక వరిధాన్యం మొత్తం నేనే కొంటున్నా అంటున్నడు. ధాన్యం కొనుగోలుకు ఎఫ్​సీఐ, కేంద్రం డబ్బులు చెల్లిస్తాయి. ధాన్యం కొనుగోళ్లలో పంజాబ్​ మొదటిస్థానంలో ఉంటే మేమే కొన్నామని అసత్యాలు చెప్పొద్దు సార్. మిల్లర్లకు మేలు జరిగేలా మీరు వ్యవహరిస్తున్నారు. హుజూరాబాద్​ ఉపఎన్నిక కోసమే జిల్లాల పర్యటనలు. కేవలం భాజపాను విమర్శించేందుకు అధికార వేదికలు ఉపయోగించొద్దు. ఇవాళ నుంచి కేంద్రం ఉచిత టీకాల కార్యక్రమం ప్రారంభిస్తే ఏర్పాట్లు ఎక్కడా చేయలేదు. దుబ్బాక మాదిరే హుజూరాబాద్​లో ఉపఎన్నికతోనైనా సీఎం కేసీఆర్​ కళ్లు తెరుస్తాడో చూద్దాం. - రఘునందన్​ రావు, దుబ్బాక ఎమ్మెల్యే

ఇదీ చూడండి: Cm Convoy: సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు కేయూ విద్యార్థుల యత్నం

Last Updated : Jun 21, 2021, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.