ETV Bharat / state

వైద్య విద్యార్థిని ఆరోగ్యంపై ఈటల ఆరా.. ప్రభుత్వానికి మూడు డిమాండ్లు - ఈటల రాజేందర్ తాజా వార్తలు

వరంగల్​ ఎంజీఎంలో పీజీ విద్యార్థిని ఆరోగ్యంపై ఈటల రాజేందర్ ఆరా తీశారు. హైదరాబాద్‌ నిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఈటల... ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Etela Rajender
Etela Rajender
author img

By

Published : Feb 26, 2023, 3:58 PM IST

Updated : Feb 26, 2023, 4:46 PM IST

KMC Pg Medical Student Suicide attempt : రాష్ట్రంలో వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ నిమ్స్ ఆస్పత్రికి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వెళ్లారు. వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తెలుసుకున్నారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వైద్య విద్యార్థిని ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని పేర్కొన్నారు.

Etela Rajender comments on KMC Pg Medical Student వేధింపుల గురించి పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వైద్య విద్యార్థిని ఘటనలో పోలీసుల వైఫల్యం కూడా కొంత ఉందని ఈటల ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వైద్య కళాశాలల్లో నిగూఢంగా ఇంకా ర్యాగింగ్ కొనసాగుతోందని తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారమంతా పీజీ విద్యార్థుల మీదే పడుతోందన్న ఈటల.. వైద్య కళాశాలలు పెరిగినంతగా బోధనాసిబ్బంది పెరగట్లేదని వెల్లడించారు. బాధిత కుటుంబానికి ఓదార్పునిచ్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈటల అన్నారు. తాజాగా వైద్య విద్యార్థిని హెల్త్ బులిటెన్‌ను నిమ్స్ వైద్య బృందం విడుదల చేసింది. ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.

గొప్ప డాక్టర్ కావాలని కలలు కన్న గిరిజన బిడ్డ. సీనియర్ వేధింపులు.. ముఖ్యంగా సైఫ్.. ఇబ్బందులు పెడుతున్నట్లు హెచ్‌ఓడీకి చెప్పినా ప్రయోజనం లేకపోయింది. అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్పింది. మెడికల్ కాలేజీల్లో పీజీ చదివే అమ్మాయిలపై కొంత మంది సైకోల్లా బిహేవ్ చేస్తున్నారు. అక్కడి హెచ్‌ఓవోడీలు సకాలంలో స్పందించి.. ఉంటే ఇలాంటి ఘటనలు జరిగివి కావు. ప్రిన్సిపాల్ కూడా స్పందించకపోవడం బాధాకరం. ఒకటి సమగ్ర విచారణ జరిపించాలి. నంబర్ 2 దోషులను కఠినంగా శిక్షించాలి. నంబర్ 3 మెరుగైన వైద్యం అందించాలి. ఈ మూడింటిని వెంటనే నేరవేర్చాలని ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా... - ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే

వైద్య విద్యార్థిని ఆరోగ్యంపై ఈటల ఆరా.. ప్రభుత్వానికి మూడు డిమాండ్లు

ఇవీ చదవండి:

Last Updated : Feb 26, 2023, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.