BJP LP Leader in Telangana : ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 8 మంది బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈనెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, కాషాయ నేతలు ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రొటెం స్పీకర్‌గా మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో ప్రమాణం చేయబోమని ప్రకటించి గైర్హాజరయ్యారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని అక్బరుద్దీన్ ఓవైసీని (Akbar Uddin Owaisi) ప్రొటెం స్పీకర్ చేయటంపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు సైతం ఫిర్యాదు చేశారు.
BJP MLAs Competing for Legislative Party Leader Post : తరువాత అసెంబ్లీ గేట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఇవాళ సమావేశాలు ప్రారంభం కానుండటంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ప్రమాణం చేయాలని వారు భావిస్తున్నారు. ఈసారి శాసనసభాపక్ష నేత లేకుండానే సమావేశాల్లో పాల్గొననున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి కేవలం రాజాసింగ్ (MLA Raja Singh)ఒక్కరే గెలుపొందగా తర్వాత ఉపఎన్నికల్లో రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ విజయం సాధించారు. కాగా ఎల్పీ నేతగా రాజాసింగ్‌కు పార్టీ అవకాశం ఇచ్చింది.
ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఉంటే నేను ప్రమాణస్వీకారం చేయను : రాజా సింగ్
నాయకుల మధ్య ఆధిపత్య పోరు : ఇటీవలి ఎన్నికల్లో కమలం పార్టీ 8 స్థానాల్లో గెలుపొందటంతో, ఎల్పీ నేత రేసులో రాజాసింగ్‌తో పాటు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా, ఇప్పుడే శాసనసభాపక్ష నేతను నిర్ణయిస్తే నష్టపోయే ప్రమాదముందని హైకమాండ్ గ్రహించినట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాల తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
శాసనసభాపక్ష నేత నియామకంపై జాతీయ నాయకత్వం తాత్సారం : శాసనసభాపక్ష నేత నియామకంపై జాతీయ నాయకత్వం తాత్సారం చేయటంపై, పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్‌లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన నేతకు బీజేపీ ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టింది. దీని ప్రకారం చూస్తే మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డికి (Katipally Venkata Ramana Reddy)అవకాశం కల్పించనుందా? లేక రెండుసార్లు గెలిచిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి అవకాశం కల్పించనుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
మజ్లిస్‌తో అంటకాగే ఏ పార్టీతో బీజేపీ కలిసి ముందుకు వెళ్లదు : రఘునందన్ రావు
అందరితో కలుపుకుని వెళ్లే నేతకే అవకాశం : హ్యాట్రిక్ విజయం సాధించిన రాజాసింగ్‌కు తెలుగుపై పట్టు లేకపోవటం, హిందుత్వ ఎజెండా, గోషామహల్ వరకే పరిమితమవ్వటం ప్రతికూలతలుగా ఉన్నాయి. గతంలో వేరే అవకాశం లేకే రాజాసింగ్‌కు ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేల అందరి అభిప్రాయం తీసుకున్నాకే పార్టీ తుది నిర్ణయం వెలువరించే అవకాశం ఉన్నట్లు సమచారం. అందరితో కలుపుకుని వెళ్లే నేతకే అవకాశం ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతుండగా, పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఉత్కంఠను కలిగిస్తోంది.
ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ నియామకం - గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు