ETV Bharat / state

Bjp Operation Aakarsh: ఆపరేషన్ ఆకర్ష్.. ఆ ఇద్దరికే కొత్త బాధ్యతలు

Bjp Operation Aakarsh: ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వేగవంతం చేయాలని కమలనాథులు నిర్ణయించారు. ఈ బాధ్యతలను ముఖ్యమైన నేతలకు అప్పగించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఇంద్రాసేనా రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ఇంద్రాసేనారెడ్డి కోరారు. ఈ బాధ్యతలను ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కో ఛైర్మన్‌గా వివేక్ వెంకటస్వామికి అప్పగించాలనే యోచనలో భాజపా నేతలు ఉన్నారు.

Bjp Operation Aakarsh
ఆపరేషన్ ఆకర్ష్
author img

By

Published : Jul 4, 2022, 9:25 PM IST

Bjp Operation Aakarsh: ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేయాలని భాజపా నిర్ణయించింది. ఈ బాధ్యతలను ముఖ్య నేతలకు అప్పగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కో ఛైర్మన్‌గా వివేక్ వెంకటస్వామికి బాధ్యతలు అప్పగించాలని నేతలు సమాలోచనలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఇంద్రసేనా రెడ్డి ఉన్నారు. తనను బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన కోరారు.

ఈటలకు అప్పగిస్తే చేరికలు ఎక్కువగా ఉంటాయని భాజపా నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భాజపా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం బండి సంజయ్‌ అధ్యక్షతన పార్టీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌ల భేటీ జరగనుంది. పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప సభపై మొత్తం 119 నియోజకవర్గాల్లో జరిగిన సంపర్క్‌ యోజనపై ఇందులో సమీక్షించనున్నారు. అలాగే పార్లమెంటు ప్రవాస్‌ యోజన తయారీపై చర్చతో పాటు భవిష్యత్‌ కార్యక్రమాలపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: ఒకప్పుడు ఆ రాష్ట్రాలు.. ఇప్పుడు తెలంగాణే ఫస్ట్: కేటీఆర్

'తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి కావాలి.. ప్రత్యేక దేశం కోసం పోరాడేలా చేయకండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.