ETV Bharat / state

'పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం.. ఎన్నికలకు సిద్ధం కండి' - bjp news

ఇటీవలి వరకు వరుస ఎన్నికలు జరిగాయని.. ఇక రాష్ట్ర స్థాయిలో పార్టీపై పూర్తిస్థాయి దృష్టి పెట్టి సంస్థాగతంగా బలోపేతం చేయాలని రాష్ట్ర భాజపా నేతలకు పార్టీ సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌ సూచించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఎంతో సమయం లేదని..సన్నద్ధం కావాలని పార్టీ ముఖ్య నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు కేంద్రంలో మోదీ అందిస్తున్న తరహాలో సుపరిపాలన అవసరమని, కేసీఆర్‌ సర్కార్‌ అణచివేత చర్యలకు బెదిరేదని లేదని  తరుణ్‌చుగ్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని భాజపా వదిలిపెట్టబోదని హెచ్చరించారు.

'పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా.. ఎన్నికలకు సిద్ధం కండి'

author img

By

Published : Feb 28, 2022, 8:08 AM IST

రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఎంతో సమయం లేదని..సన్నద్ధం కావాలని పార్టీ ముఖ్య నేతలకు భాజపా సహ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) శివప్రకాశ్‌ పిలుపునిచ్చారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి చెందిన పార్టీ జాతీయ నేతలు, రాష్ట్ర పదాధికారులతో పార్టీ కార్యాలయంలో శివప్రకాశ్‌ ఆదివారం వేర్వేరుగా సమావేశమయ్యారు. బండి సంజయ్‌ అధ్యక్షతన జరిగిన ముఖ్యనేతల సమావేశంలో కిషన్‌రెడ్డి, డీకే అరుణ, కె.లక్ష్మణ్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, జితేందర్‌రెడ్డి, విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివప్రకాశ్‌ మాట్లాడుతూ.. ఇది ఎన్నికల సంవత్సరం అని, నేతలు అంతా బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేస్తూనే, ఇతర పార్టీల నుంచి చేరికలు జరిగేలా చూడాలన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర పదాధికారులతోనూ సమావేశం అయ్యారు. ఇటీవలి వరకు వరుస ఎన్నికలు జరిగాయని.. ఇక రాష్ట్ర స్థాయిలో పార్టీపై పూర్తిస్థాయి దృష్టి పెట్టి సంస్థాగతంగా బలోపేతమవుదామని సూచించారు. ఇటీవల ప్రత్యేక సమావేశాలు పెట్టుకున్న అసంతృప్త నేతలు.. శివప్రకాశ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు.. పదవులు రాలేదని అనుకోవద్దని, పార్టీ కోసం పని చేస్తూ వెళుతుంటే అవకాశాలు అవే వస్తాయని నాయకులతో అన్నట్లు సమాచారం.

తెలంగాణలో సుపరిపాలన అవసరం

తెలంగాణకు కేంద్రంలో మోదీ అందిస్తున్న తరహాలో సుపరిపాలన అవసరమని, కేసీఆర్‌ సర్కార్‌ అణచివేత చర్యలకు బెదిరేదని లేదని తరుణ్‌చుగ్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని భాజపా వదిలిపెట్టబోదని హెచ్చరించారు. యువ తెలంగాణ పార్టీని భాజపాలో విలీనం చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ తమ కార్యకర్తలతో కలిసి గన్‌పార్క్‌ నుంచి ర్యాలీగా భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి నిర్వహించిన సభకు తరుణ్‌చుగ్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

మజ్లిస్‌కు సీఎం భయపడుతున్నారు

కేసీఆర్‌ రాజరికం తరహా పాలన చేస్తున్నారని ప్రజాస్వామ్యంలో ఇది నడవదని.. తెలంగాణ అభివృద్ధి, ప్రజాస్వామ్యం, యువత ఆకాంక్షల కోసం భాజపా పోరాడుతుందని తరుణ్‌చుగ్‌ అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు కేసీఆర్‌ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి గడీలు బద్దలు కొడతామని, ఆయన కుటుంబాన్ని రాష్ట్ర పొలిమేరల వరకు తరిమేస్తామని వ్యాఖ్యానించారు. ‘భాజపాను చూసి కేసీఆర్‌ గజగజ వణుకుతున్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీల నేతల్ని కలుస్తున్నారు. ఇవన్నీ కలిసి దేశాన్ని ఏం చేస్తాయో తెలంగాణ సమాజం ఆలోచించాలి. హైదరాబాద్‌లో గోరక్షకులు, భాజపా కార్యకర్తలపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. మజ్లిస్‌కు సీఎం భయపడుతున్నారు’ అంటూ సంజయ్‌ మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో ఒక మంత్రి తప్పుడు అఫిడవిట్‌తో ఎన్నికయ్యారంటూ పోరాడుతున్న యువకులపై కేసీఆర్‌ సర్కార్‌ హత్యాయత్నం కేసు పెట్టింది. ఆ యువకుల్ని బేషరతుగా విడుదల చేయాల్సిందే. లేదంటే ఆ మంత్రి రాజీనామా చేసేదాక భాజపా ఉద్యమిస్తుంది’అని హెచ్చరించారు.

రాజ్యాంగాన్ని టచ్‌ చేసి చూడు: కిషన్‌రెడ్డి

‘పదే పదే టచ్‌ చేసి చూడు అంటుంటావు.. రాజ్యాంగాన్ని మార్చాలంటున్నావు.. దాన్ని టచ్‌ చేసి చూడు..’ అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. రాజ్యాంగబద్ధంగానే కేసీఆర్‌ని ఇంటికి పంపడం ఖాయమన్నారు. ఆదివారం రాత్రి భాజపా ఎస్సీ నగర మోర్చా ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లో జరిగిన సంత్‌ రవిదాస్‌ మహారాజ్‌ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.