ETV Bharat / state

'కరోనా మీద స్పందించిన గవర్నర్​పై విమర్శలు చేస్తారా...?' - governor tamilisai response on corona

రాష్ట్రంలో వేగంగా వ్యాపిస్తోన్న కరోనాపై స్పందించిన గవర్నర్​పై అధికార పార్టీ నేతలు విమర్శలు చేయటం సరికాదని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్​ మండిపడ్డారు. గవర్నర్​ స్పందనను తమ పార్టీ స్వాగతిస్తుందని తెలిపారు.

bjp laxman welcomed governor response on corona

author img

By

Published : Aug 19, 2020, 5:50 PM IST

రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనాపై గవర్నర్ తమిళిసై స్పందించడాన్ని భాజపా స్వాగతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. గవర్నర్ స్పందనపై సీఎం సానుకూలంగా స్పందించకుండా తమ భజనపరుల చేత రాజకీయంగా ఎదురుదాడి చేయించడం ప్రజాస్వామ్యానికే చేటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కొవిడ్- 19 విజృంభించడంపై హైకోర్టు అనేక పర్యాయాలు మొట్టికాయలు వేసినా... తమకు పట్టనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని లక్ష్మణ్​ ఆరోపించారు. ఈ విషయాన్ని గవర్నర్ తమిళిసై ప్రస్తావించడంపై విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల చేత గవర్నర్​కు వెంటనే క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి : లంచం కేసులో అధికారుల కస్టడీకి అనిశా పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.