జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా ఆసిఫ్‌నగర్ అభ్యర్థి లావణ్య ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.
గతంలో ఎంఐఎం కార్పొరేటర్ హామీలను గాలికొదిలేశారని ఆమె అన్నారు. వరదసాయం ప్రజలకు సక్రమంగా అందజేయలేదని తెలిపారు. భాజపాను గెలిపిస్తే డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మీ అమూల్యమైన ఓటును వేసేముందు ప్రజలు ఆలోచించాలని లావణ్య విజ్ఞప్తి చేశారు.