ఆర్టీసీ కార్మికుల సమ్మె 11 రోజు కొనసాగుతోంది. హైదరాబాద్లోని అన్ని బస్టాండ్లు డిపోల వద్ద ఆందోళనలు నిర్వహించారు. ఉప్పల్ డిపో కార్మికులతో కలిసి ఐకాస నేతలు వరంగల్ జాతీయ రహదారిపై మానవహారం చేపట్టారు. దీనితో వాహనాలకు అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులు సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నిదానాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపో ముందు కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్, భాజపా, ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. కూకట్పల్లిలో ఆర్టీసీ కార్మికులకు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు.
ఇదీ చూడండి:సొంత ఛాపర్ కూల్చివేతలో ఆరుగురిపై ఐఏఎఫ్ చర్యలు!