సర్కార్ చేతగానితనం వల్లే సునీల్ ఆత్మహత్య చేసుకున్నాడని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. తన కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చిన కేసీఆర్.. రాష్ట్రంలోని నిరుద్యోగుల గురించి పట్టించుకోవట్లేదని విమర్శించారు. సునీల్ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.
పట్టభద్రుడు సునీల్ నాయక్‌ది ఆత్మహత్య కాదని... ముమ్మాటికీ కేసీఆర్ సర్కార్ చేతగానీతనంతో చేసిన హత్యేనని ఆరోపించారు. యువకులు ఎవ్వరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తిచేశారు. సర్కార్‌పై ఒత్తిడి తెచ్చి ఉద్యోగాలు సాదిద్ధామని, కానీ ఇలా ఆత్మార్పరణలతో కాదని ఆయన తెలిపారు. ఏదైనా త్యాగం చేయాల్సి వస్తే నేతలుగా తాము ముందుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రాజ్యాంగ స్ఫూర్తి.. రాసుకున్న రాతల అమలేది: ఈటల