అలసిసొలసిన మనసుకు ఆహ్లాదకరమైన ప్రకృతి హాయినిస్తుంది. ఈ హాయితో... మనసులోని భాధలన్నీ మాయమైపోతాయి. అలాంటి ప్రకృతి అందాలకు నెలవుగా మారింది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా సీలేరు. ఇటీవల కురిసిన వర్షాలతో... సీలేరు పరిసర ప్రాంతాల్లోని జలపాతాలు ఉరకలేస్తున్నాయి. చుట్టూ పచ్చని ప్రకృతిలో... కొండల మధ్య పొంగి ప్రవహిస్తున్నాయి.
దారాలమ్మ ఘాట్ రోడ్డులో ఉన్న జలపాతం... సీలేరుకు వచ్చే మార్గంలోని ఐస్ గడ్డ జలపాతం... సీలేరు కాంప్లెక్స్‌లోని పోల్లూరు జలపాతం... ఉరకలేస్తూ... పర్యాటకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. పాలనురగలా కనపడే ఈ జలపాతాలు... ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను ముగ్ధులయ్యేలా చేస్తున్నాయి.