బీసీ గురుకుల విద్యార్థులు చదువులతో పాటు సాహస క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ ఉన్నత స్థానాలకు దూసుకుపోతున్నారు. సెయిలింగ్‌లో ప్రావీణ్యం కనబర్చిన నలుగురు విద్యార్థులు అభిరాం, నితిన్, మల్లేశ్, కార్తీక్... ఇండియన్ నేవీకి ఎంపిక కాగా మరికొందరు ప్రతిష్ఠాత్మక ఇండియన్ ప్రాబబుల్స్‌కు సెలెక్టయ్యారు.
బీసీ హాస్టల్లో చదువుతో పాటు క్రీడలకు కూడా శిక్షణ ఇస్తుండటం విద్యార్థులకు తోడ్పడుతోంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను విద్యార్థులు కలిసి అభినందించారు. విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని మరింత మంది మరిన్ని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యతో పాటు ఇతర అంశాలు, ఆటల్లో ఇస్తున్న శిక్షణ వల్ల మెరికల్లాంటి విద్యార్థులు తయారవుతున్నారని పేర్కొన్నారు.
ఇవీచూడండి: బడ్జెట్ ధరలో హెచ్‌పీ 'క్రోమ్‌బుక్ 11ఏ'