సద్దుల బతుకమ్మ సంబురానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధమైంది. పట్టణాలు, పల్లెల్లో వాడవాడ కోలాహలంగా మారనుంది. తీరొక్క పూలతో సద్దుల బతుకమ్మలు కొలువుదీరనున్నాయి. ఉయ్యాల పాటలతో, పడుతుల ఆటలతో వాడవాడ హోరెత్తనుంది.
ఊరూరా.. భారీ ఏర్పాట్లు
తొమ్మిది రోజుల పండుగలో చివరి రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. బతుకమ్మ నిమజ్జనాల కోసం ఆయా చెరువుల వద్ద విద్యుత్‌కాంతులతో ముస్తాబుచేశారు. ప్రజల సౌకర్యార్థం పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా... పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సహా... అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఇవీ చూడండి: సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్