Telangana Cultural Society Singapore: సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ కార్యవర్గం సొసైటీ సభ్యులు.. ఈరోజు లిటిల్ ఇండియాలో ఉన్న ద్వారకా రెస్టారెంట్లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 60మంది టీసీఎస్ జీవితకాల సభ్యులు హాజరయ్యారు. సింగపూర్‌లో ఉంటున్న తెలంగాణ వాసులందరూ ఒక్క తాటిపై నిలబడి కష్టసుఖాలు పంచుకోవాలని టీసీఎస్ఎస్ సభ్యులు తెలిపారు.
అక్టోబర్ 1న భారీగా బతుకమ్మ వేడుకలు: సింగపూర్‌లో బతుకమ్మ సంబురాలకు సంబంధించిన కరపత్రిక, బతుకమ్మ వీడియోపాట ప్రోమోను విడుదల చేశారు. బతుకమ్మ వేడుకలను ప్రతి సంవత్సరం మాదిరిగా స్థానిక సంబవాంగ్ పార్క్‌లో అక్టోబర్ 1న ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీసీఎస్ఎస్ సభ్యులు చెప్పారు. ఈసారి విడుదల చేసిన బతుకమ్మ వీడియో సాంగ్ ప్రోమో ఎంతో ప్రత్యకమైనదిగా పేర్కొన్నారు.
ఈసారి ప్రత్యేకంగా సాంగ్ రూపకల్పన: తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ వారు ఈపాటను ప్రత్యేకంగా రాసి పాడించడం జరిగిందని తెలిపారు. ఈ పాటను రచించి సాహిత్యం అందజేసిన కాసర్ల శ్రీనివాస రావును గీతాన్ని ఆలపించిన అత్తిలి శ్రావ్యను అందరూ అభినందించారు. సమావేశంలో పాల్గొన్న టీసీఎస్ఎస్ సభ్యులు సొసైటీ అభివృద్ధికి ఎన్నో సూచనలు ఇచ్చారని కార్యవర్గ సభ్యులు తెలిపారు. సొసైటీకి సహకారం అందిస్తున్న సభ్యులకు, దాతలకు కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
సమావేశంలో అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్‌రెడ్డి, కార్యదర్శి గడప రమేష్‌బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్‌రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు సునీతరెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్‌కుమార్, రోజారమణి, నంగునూరి వెంకటరమణ, కార్యవర్గ సభ్యులు, గార్లపాటి లక్ష్మారెడ్డి, అనుపురం శ్రీనివాస్, శశిధర్‌రెడ్డి, పెరుకు శివరామ్‌ప్రసాద్, కాసర్ల శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, భాస్కర్ నడికట్ల, శివప్రసాద్ ఆవుల, రవికృష్ణ విజాపూర్ తదితరులు పాల్గొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి:ఆస్ట్రేలియాలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు
శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు
137 ఏళ్లలో మూడు సార్లే అధ్యక్ష ఎన్నికలు.. ఈసారి సరికొత్త లెక్క.. పార్టీ పరిస్థితి మారేనా?